తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అమ్మోరు తల్లి' నయనతార.. సామాన్యుడి చెంతకొస్తే? - నయన్ విఘ్నేశ్ శివన్

నయనతార 'అమ్మోరు తల్లి' ట్రైలర్ అలరిస్తోంది. దీపావళి కానుకగా నవంబరు 14న ప్రేక్షకులు ముందుకు రానుందీ సినిమా.

nayanthara ammoru thalli telugu trailer
నయనతార 'అమ్మోరు తల్లి' ట్రైలర్

By

Published : Oct 25, 2020, 4:34 PM IST

స్టార్ హీరోయిన్ నయనతార కొత్త సినిమా 'అమ్మోరు తల్లి'. తెలుగు ట్రైలర్​ను దసరా కానుకగా, సూపర్​స్టార్ మహేశ్​బాబు ఆదివారం విడుదల చేశారు. అమ్మోరు వేషధారణలో ఆకట్టుకున్న నయన్.. చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది.

తమ కష్టాలను తీర్చమని ఓ కుటుంబం తమ కులదైవమైన మూడు పుడకల అమ్మవారిని ప్రార్థించడానికి వెళ్తే, నిజంగా ప్రత్యక్షమైన అమ్మవారు వారికి ఎలాంటి వరాలు ఇచ్చింది? ఆ తర్వాత ఆ కుటుంబం ఎలా మారిపోయింది? అసలు అమ్మవారు ఎందుకు ఈ భూమ్మీదకు వచ్చారు?నిజంగా ఆమె అమ్మవారేనా? తెలియాలంటే ‘అమ్మోరు తల్లి’ సినిమా చూడాల్సిందే. ‘మీ శక్తితో ఆన్‌లైన్‌ క్లాస్‌ను క్యాన్సిల్‌ చేస్తారా’ అంటూ అమ్మవారి పాత్ర పోషించిన నయనతారను అడగ్గా, ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న సన్నివేశం నవ్వులు పంచుతోంది.

ABOUT THE AUTHOR

...view details