తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరోసారి 'సీత' పాత్రలో నయనతార - అల్లు అరవింద్

భారీ బడ్జెట్​తో తెరకెక్కనున్న త్రీడీ 'రామాయణ'లో హీరోయిన్​ నయనతార సీత పాత్ర పోషించనుందని సమాచారం. 2021లో తొలిభాగం విడుదల కానుంది.

మరోసారి 'సీత' పాత్రలో నయనతార

By

Published : Jul 13, 2019, 2:11 PM IST

భారతీయ ఇతిహాసాల్లో గొప్పదైన రామాయణాన్ని ఇప్పటికే అనేక మంది దర్శకులు అనేక రకాలుగా వెండితెరపై ఆవిష్కరించారు. ఈ మహాకావ్యం ఇప్పుడు త్రీడీ హంగులతో రూపుదిద్దుకోనుంది. అల్లు అరవింద్​తో పాటు మధు మంతెన, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో నయనతార కనిపించనుందని సమాచారం. ఇప్పటికే 'శ్రీరామరాజ్యం' సినిమాలో ఆ పాత్ర చేసి ప్రేక్షకుల్ని మెప్పించిందీ హీరోయిన్​. ఇప్పుడు మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.

శ్రీరామరాజ్యంలోని సీత పాత్రలో నయనతార

'దంగల్' దర్శకుడు నితీష్‌ తివారి, రవి ఉద్యావర్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. నటీనటుల ఎంపికను వేగవంతం చేసింది చిత్రబృందం. మొత్తం మూడు భాగాలుగా వస్తున్న ఈ సినిమా తొలి భాగం 2021లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: విలన్​గా నయనతార

ABOUT THE AUTHOR

...view details