తెలంగాణ

telangana

ETV Bharat / sitara

Nayantara: స్టార్ హీరో చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ!

లేడి సూపర్​స్టార్​ నయనతార(Nayantara) త్వరలోనే బాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. కోలీవుడ్​ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో షారుక్​ ఖాన్​ నటించబోయే సినిమాలో ఆమె లీడ్ రోల్ పోషించనుందని తెలుస్తోంది.

nayantara
నయనతార

By

Published : Jun 26, 2021, 7:43 AM IST

దక్షిణాది నుంచి ఎంతో మంది హీరోయిన్లు బాలీవుడ్​లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అందులో కొంతమంది ఇంకా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే లేడీ సూపర్​ స్టార్​ నయనతార(Nayantara) మాత్రం ఇంత వరకు హిందీలో ఎంట్రీ ఇవ్వలేదు. ఆమె ఎప్పుడెప్పుడు బాలీవుడ్​లో అడుగుపెడుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నయన్.. త్వరలోనే బాలీవుడ్​ ఎంట్రీకి సిద్ధమవుతుందని జోరుగా ప్రచారం సాగుతోంది.

స్టార్​ హీరో షారుక్​ ఖాన్(Sharukh Khan)​ త్వరలోనే కోలీవుడ్​ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేయనున్నారు. ఇందులో నయన్ నటించనుందని తెలుస్తోంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్​కు పండగనే చెప్పాలి.

నయన్​.. ప్రస్తుతం 'నేత్రికన్'​, అన్నాత్తె', 'కథు వాకులా రెండు కాదల్'​, 'ఆరడగుల బులెట్​' సినిమాల్లో నటిస్తోంది. షారుక్​.. త్వలోనే 'పఠాన్'​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇదీ చూడండి: 'లూసిఫర్' కథలో మార్పు.. కీలకపాత్రలో నయన్​!

ABOUT THE AUTHOR

...view details