తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కాబోయే భర్తతో షిర్డీ సాయిని దర్శించుకున్న నయన్​ - nayanthara vignesh shivan relationship

ప్రముఖ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్(nayanthara vignesh shivan marriage) షిర్డీ సాయిబాబా సేవలో పాల్గొన్నారు. అక్కడి ఆలయ అధికారులు, పూజారులు వారిని శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Nayantara and Vighnesh
నయనతార, విజ్ఞేష్ శివన్

By

Published : Oct 18, 2021, 6:05 PM IST

ఖాళీ దొరికితే విహారయాత్రలకు వెళ్తుంటారు కోలీవుడ్​ ప్రేమజంట నయనతార, విఘ్నేష్ శివన్(nayanthara vignesh). ఇటీవల కొంతకాలం నుంచి ఈ జోడీ తీర్థయాత్రలపై దృష్టిపెట్టారు. ఈ మధ్యలోనే పలు దేవాలయాలను సందర్శించిన వీరు(nayanthara vignesh shivan relationship) తాజాగా షిర్డీ సాయిబాబాను ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులు, పూజారులు శాలువాతో వారిని సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

నయనతార, విజ్ఞేష్ శివన్

దేవాలయాన్ని సందర్శించడం ఆనందంగా ఉందని చెప్పిన నయన్(nayanthara vignesh shivan wedding)​.. చాలా రోజుల నుంచి బాబాను దర్శించాలని తాము అనుకుంటున్నట్లు తెలిపారు. కానీ కరోనా కారణంగా ఆలస్యమైందని చెప్పారు.

నయన్​నయనతార, విజ్ఞేష్ శివన్

'నేను రౌడీనే' షూటింగ్‌ సమయంలో నయనతార-విఘ్నేష్ శివన్​ల మధ్య పరిచయం ఏర్పడింది. కొంతకాలానికి వారి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ క్రమంలోనే ఇటీవల తమకు నిశ్చితార్థం జరిగిందని నటి నయన్‌ తెలిపారు. ఇక, సినిమాల(nayantara movies list) విషయానికి వస్తే రజనీకాంత్​ 'అన్నాత్తే', 'గాడ్​ ఫాదర్​', 'గోల్డ్', 'కాతువాక్కుల రెందు కాదల్‌'లో నయన్‌ నటిస్తున్నారు.

ఇదీ చూడండి: కాబోయే భర్తకు నయన్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌

ABOUT THE AUTHOR

...view details