తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ప్రభుదేవా, నయన్​ కలసి నటించట్లేదు' - ప్రభుదేవా, నయనతార కలిసి నటింట్లేదు

ప్రభుదేవా, నయనతార కలిసి 'కరుప్పు రాజా వైలై రాజా' చిత్రంలో నటిస్తున్నారనే వార్తలు అవాస్తమని స్పష్టం చేశారు చిత్ర నిర్మాత ఈశ్వరీ కె.గణేశ్​. ఈ సినిమాను పూర్తిచేసే ఉద్దేశం లేదని వెల్లడించారు.

nayantara and prabhudeva
ప్రభుదేవా, నయన్​

By

Published : Jun 4, 2020, 2:51 PM IST

నృత్యదర్శకుడు ప్రభుదేవా, అగ్రకథానాయిక నయనతార.. తన సినిమాలో నటించడం లేదని నిర్మాత ఈశ్వరీ కె.గణేశ్‌ చెప్పారు. ప్రభుదేవా దర్శకత్వంలో ఈశ్వరీ నిర్మిస్తున్న 'కరుప్పు రాజా వెలై రాజా' అనే చిత్రం అప్పట్లో ప్రారంభమైంది. విశాల్‌, కార్తీ ప్రధాన పాత్రల్లో కొంత షూటింగ్‌ జరుపుకున్న ఈ ప్రాజెక్టు.. అనివార్య కారణాలతో రెండేళ్ల కిందటే నిలిచిపోయింది.

అయితే, తాజాగా ఇది తిరిగి సెట్స్‌పైకి వెళ్లనుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాకుండా త్వరలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రభుదేవా, నయనతార కలిసి నటించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత ఈశ్వరీ సదరు వార్తలపై స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పారు.

"కరుప్పు రాజా వెలై రాజా చిత్రంలో ప్రభుదేవా-నయన్‌ కలిసి నటిస్తున్నారని వస్తోన్న వార్తలు అవాస్తవం. ప్రభుదేవా దర్శకత్వంలో కార్తీ, విశాల్‌ ప్రధాన పాత్రల్లో నేను నిర్మించాలనుకున్న సినిమా కొన్ని సంవత్సరాల క్రితమే వాయిదా పడింది. ఇప్పుడు ఆ సినిమాను పూర్తిచేయాలనే ఉద్దేశం నాకు లేదు" అని ఈశ్వరీ తెలిపారు.

ఇదీ చూడండి : డబుల్​ సర్​ప్రైజ్​: 'కామ్రేడ్ భారతక్క'గా ప్రియమణి

ABOUT THE AUTHOR

...view details