బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ అభిమానులకు గుడ్ న్యూస్. దాదాపు రెండేళ్ల నుంచి వెండితెరకు దూరంగా ఉన్న షారుక్(Shahrukh Khan).. కోలీవుడ్ డైరెక్టర్‌తో ఓ సినిమాకు ఓకే చేసినట్లు తెలిసింది. యువ దర్శకుడు అట్లీతో షారుక్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రం(Atlee Shah rukh movie) తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం పుణెలో ప్రారంభించినట్లు సమాచారం. ఈ మూవీ చిత్రీకరణ కోసం ప్రముఖ నటి నయనతార, ప్రియమణి పుణెకు చేరుకున్నట్లు తెలిసింది.
ఈ చిత్రంపై కొంత కాలం నుంచి భారీగా ఊహాగానాలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి నేపథ్య సంగీతం కూడా ముగిసినట్లు టాక్. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం ఇవ్వనున్నారు. అయితే.. ఈ మూవీ గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.