తెలంగాణ

telangana

ETV Bharat / sitara

త్వరలో ఓ ఇంటివారు కాబోతున్న నయన్, విఘ్నేశ్? - nayantara

కథానాయిక నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ త్వరలో వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. త్వరలో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక జరిగే అవకాశముంది.

నయన్

By

Published : May 5, 2019, 8:00 PM IST

లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌లు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. నవంబర్‌లో వీరిద్దరి నిశ్చితార్థం జరగనుందని సమాచారం. ఇప్పుడీ విషయం కోలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల నయన తార వేలికి ఓ ఉంగరం ఉండడం కూడా చర్చనీయాంశమైంది. వీరిద్దరు ఇదివరకే ఉంగరాలు మార్చుకున్నారని ప్రచారం సాగుతోంది.

అధికారికంగా అందరి సమక్షంలో నిశ్చితార్థ వేడుక నిర్వహించాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నాయట. అంతా సక్రమంగా జరిగితే 2020లో నయన్, విఘ్నేశ్‌లు ఓ ఇంటివారు అవుతారు. 2015లో 'నానుమ్‌ రౌడీదాన్‌'’ అనే చిత్రం ద్వారా నయన్, విఘ్నేశ్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహానికి దారి తీసి ప్రేమగా మారింది.

అప్పటినుంచి నయన్, విఘ్నేశ్‌ జంటగా విహారయాత్రలకు వెళుతున్నారు. అక్కడ తీసుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తున్నారు. ప్రస్తుతం నయన్‌ తెలుగులో ‘సైరా నరసింహారెడ్డి’, ‘మిస్టర్‌ లోకల్‌’, తమిళంలో ‘దర్బార్‌’ సినిమాల్లో నటిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details