దక్షిణాదిలో చేతి నిండా ఆఫర్లతో బిజీ అయిపోయింది లేడీ సూపర్ స్టార్ నయనతార. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. సైరా, తలపతి 63, దర్బార్ చెప్పుకోదగ్గవి. ఇవి కాకుండా మరి కొన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది.
'దర్బార్'లో అడుగు పెట్టనున్న నయన్ - nayantara
లేడీ సూపర్ స్టార్ నయనతార ఈరోజు నుంచి 'దర్బార్' షూటింగ్లో పాల్గొననుంది. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు.
నయనతార
నయనతార ఈ రోజు 'దర్బార్' షూటింగ్లో జాయిన్ కానుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ఈ చిత్ర ప్రస్తుతం ముంబయిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. రజినీ, మురుగుదాస్ కలయికలో వస్తున్న తొలి చిత్రం అయినందున ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. బాలీవుడ్ యువ నటుడు ప్రతీక్ బబ్బర్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.