తెలుగు నటుడు నితిన్.. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హిందీలో వచ్చిన 'అంధాదున్' చిత్రానికి రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నయనతారతో ఓ కీలక పాత్రలో నటింపజేసేందుకు చిత్రబృందం ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. బాలీవుడ్ 'అంధాదున్' చిత్రంలో టబు ఓ పాత్రలో నటించింది. ఈ పాత్రలోనే నయనతార నటించాల్సి ఉంది. అయితే ఇప్పటికే చిత్రబృందం పలువురు సీనియర్ నటీమణులను కూడా సంప్రదించారు. కానీ ఇంకా ఎవరినీ ఖరారు చేయలేదు.
'అంధాధున్' రీమేక్‌లో నయనతార! - నయనతార నితిన్ వార్తలు
యువ నటుడు నితిన్ ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నాడు. 'అంధాధున్' రీమేక్‌గా తెరకెక్కనుందీ సినిమా. అయితే ఇందులో నయనతార ఓ కీలక పాత్ర పోషించనుందని సమాచారం.
నితిన్ చిత్రంలో నయనతార!
నయనతార-విఘ్నేష్ శివన్ చాలాకాలం నుంచి ప్రేమలో ఉన్నారు. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వీళ్ల గురించి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయిన నయనతార - విఘ్నేష్‌లు ఓ గుడిలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. అందుకోసం తమిళనాడులోని ఓ జోత్యుష్కుడు సలహా మేరకు అన్ని దేవాలయాలను సందర్శించిన తరువాతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారని సమాచారం.
Last Updated : Aug 6, 2020, 4:59 PM IST