తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గంటపాటు ఏడ్చిన నయన్.. కారణమేంటో తెలుసా? - Nayan Tara Cry More than One hour

తన మేనకోడలను వదిలి ఉండలేకపోతున్నానని తెలిపింది నయనతార. తను దుబాయ్ వెళ్లిందని అప్పటినుంచి బాధను అదుపుచేసుకోలేకపోతుందట. దాదాపు గంటసేపు ఏడుస్తూనే ఉందట ఈ ముద్దుగుమ్మ.

Nayan Tara Cry  More than One hour
నయనతార

By

Published : Jan 12, 2020, 8:12 AM IST

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార క్రిస్మస్‌ రోజున గంటపాటు ఏడుస్తూనే ఉందట. ఈ ప్రపంచంలోనే తనకు ఇష్టమైన వ్యక్తి తన మేనకోడలు ఏంజెలీనా (అన్నయ్య కుమార్తె) అని చెప్పింది. పాప తన అదృష్టమని, చిన్నారి పుట్టినప్పటి నుంచి కెరీర్‌ పరంగా తనకు మంచి ఆఫర్లు వస్తున్నాయని తెలిపింది.

గత ఏడాది క్రిస్మస్ నుంచి మేనకోడలితో కలిసి సమయం గడపలేకపోతున్నానని, తను దుబాయ్‌కి వెళ్లిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పాపను బాగా మిస్‌ అవుతున్న నయన్‌ ఇటీవల బాధను అదుపు చేసుకోలేకపోయిందట. దాదాపు గంటసేపు ఏడుస్తూనే ఉన్నానని తెలిపంది. ఈ మేరకు పలు కోలీవుడ్ వెబ్‌సైట్లు వార్తలు రాశాయి.

రజనీకాంత్‌తో కలిసి నయన్‌ నటించిన 'దర్బార్‌' సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకొచ్చి విజయం అందుకుంది. ప్రస్తుతం ఆమె 'నెట్రికన్‌' సినిమాలో నటిస్తున్నారు. మరోపక్క 'మూకుతి అమ్మన్' సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ 90 శాతం పూర్తయినట్లు దర్శకుడు ఆర్జే బాలాజీ ప్రకటించారు. దర్శకుడిగా ఇది ఆయన తొలి సినిమా.

ఇదీ చదవండి: క్రికెటర్లకు 'ఊర్వశి' గాలం.. పంత్, హార్దిక్ సేఫ్​​​!

ABOUT THE AUTHOR

...view details