కరోనా కారణంగా స్వీయ నిర్బంధంలో ఉంటున్నారు పలువురు సెలిబ్రిటీలు. వారికి దొరికిన ఖాళీ సమయాన్ని కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కోలీవుడ్ ప్రేమజంట నయనతార, విఘ్నేశ్ శివన్ కూడా సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు, వీడియోలతో నెటిజన్లను అలరిస్తున్నారు. తాజాగా ఈ జోడీ ఓ క్యూట్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఈ జంటను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
స్వీయ నిర్బంధంలో నయన్, విఘ్నేశ్ జోడీ - Nayanatara and Vignesh shivan show love is important against coronavirus in cute video
కరోనా ప్రభావం వల్ల కోలీవుడ్ ప్రేమజంట విఘ్నేశ్ శివన్, నయనతార స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ఈ సమయాన్ని వారు సరదాగా గడుపుతున్నారు. తాజాగా సామాజిక మాధ్యమాల్లో నయనతార పోస్ట్ చేసిన ఓ వీడియోను చూస్తే ఇది అర్థమవుతోంది.

నయనతార
అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూకు మద్దతిచ్చారు నయన్, విఘ్నేశ్. అత్యవసర సమయాల్లో తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా కృషిచేస్తున్న వైద్య, పోలీసు, పారా మెడికల్ సిబ్బందిని మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అందరూ చప్పళ్లతో వారికి ప్రశంసలు తెలియజేశారు. అయితే ఈ జోడీ ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని కరతాళ ధ్వనులు చేశారు. ఈ ఫొటోను కుడా షేర్ చేసింది నయనతార.