తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గడ్డ పార పట్టి పొలం పనులు చేసిన నవాజుద్దీన్​ - Nawazuddin field work

లాక్​డౌన్​ వల్ల ఇంటికే పరిమితమైన బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.. తాజాగా పొలం పనులు చేస్తూ కనిపించారు. నెట్​ఫ్లిక్స్​లో 'సేక్రెడ్​ గేమ్స్'తో ఈ ఈయన గుర్తింపు పొందారు.

nawaz
నవాజ్​

By

Published : Jun 23, 2020, 2:06 PM IST

తెరమీదే కాదు తెరవెనుక కూడా సాధారణమైన వ్యక్తిగా జీవిస్తానని నిరూపించారు బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. అందుకు నిదర్శనం తాజాగా ఆయన పోస్ట్​ చేసిన వీడియోనే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది. నెటిజన్లు విపరీతంగా నవాజుద్దీన్​ను ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

ఓ సామాన్యుడిలా పొలం గట్టు వద్ద మట్టిని సరిచేస్తూ వీడియోలో కనిపించారు నవాజుద్దీన్. అనంతరం పక్కనే చిన్న కాలువలోని నీటితో చేతులు శుభ్రంగా కడుక్కుని.. ఓ పార భుజాన వేసుకుని నడుచుకుంటూ వెళ్లిపోయారు.

ప్రస్తుతం లాక్​డౌన్​తో తన స్వగ్రామమైన ఉత్తరప్రదేశ్​ బుధనలో కుటుంబంతో గడుపుతున్నారు నవాజుద్దీన్​. నెట్​ఫ్లిక్స్​లో ప్రచారమైన 'సేక్రెడ్​ గేమ్స్', రితేష్ బత్రా 'ఫొటోగ్రాఫ్'లతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. కార్డిఫ్​ ఫిల్మ్ ఫెస్టివల్​లో ప్రతిష్టాత్మక గోల్డెన్ డ్రాగన్​ అవార్డు అందుకున్నారు.

ఇది చూడండి : నవాజ్​కు ప్రతిష్టాత్మక గోల్డె​న్​ డ్రాగన్​ అవార్డు

ABOUT THE AUTHOR

...view details