బాలీవుడ్ చిత్రాల్లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సినిమాల్లో హౌస్ఫుల్ ఒకటి. ఈ మూవీ నాలుగో భాగం తెరకెక్కుతోంది. ఇందులో అక్షయ్ కుమార్, రితేశ్ దేశ్ముఖ్, రానా, బాబీ దేఓల్, కృతి సనన్, కృతి ఖర్భంద, పూజా హెగ్దే ప్రధానపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.