తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నవాజ్​కు ప్రతిష్టాత్మక గోల్డె​న్​ డ్రాగన్​ అవార్డు - cardiff international film feestival

నటుడు నవాజుద్దీన్​.. కార్డిఫ్​ ఫిల్మ్ ఫెస్టివల్​లో ప్రతిష్టాత్మక గోల్డెన్ డ్రాగన్​ అవార్డు అందుకున్నాడు. హాలీవుడ్ నటి జూడీ డెంచ్​కు జీవితసాఫల్య పురస్కారం దక్కింది.

నవాజ్​కు ప్రతిష్టాత్మక గోల్డె​న్​ డ్రాగన్​ అవార్డు

By

Published : Oct 29, 2019, 9:23 PM IST

బాలీవుడ్​ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ అరుదైన గౌరవం పొందాడు. అంతర్జాతీయ స్థాయిలో నటుడిగా రాణిస్తున్నందుకుగానూ కార్డిఫ్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రతిష్టాత్మక గోల్డెన్ డ్రాగన్ అవార్డు అందుకున్నాడు. కార్డిఫ్​లో ఆదివారం.. యూకే కౌన్సిల్​ ఆఫ్ జనరల్ మిక్​ ఆంటోని చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నాడు నవాజ్.

'జేమ్స్​బాండ్' సినిమాతో ప్రసిద్ధి గాంచిన హాలీవుడ్ నటి జూడీ డెంచ్.. ఈ ఈవెంట్​లో జీవితకాల సాఫల్య పురస్కారం సొంతం చేసుకుంది. ట్విట్టర్​లో ఈమెకు శుభాకాంక్షలు చెబుతూ సంబంధిత ఫొటోలను పంచుకున్నాడు నవాజ్.

"జీవితకాల సాఫల్య పురస్కారం దక్కించుకున్నందుకు జూడీ డెంచ్​కు శుభాకాంక్షలు. నాకు అవార్డు ప్రదానం చేసిన యూకే కౌన్సిల్​ ఆఫ్ జనరల్ మిక్ ఆంటోనికి ధన్యవాదాలు" -నవాజుద్దీన్ సిద్దిఖీ, బాలీవుడ్​ నటుడు

నవాజుద్దీన్ సిద్ధిఖీ ట్వీట్

నెట్​ఫ్లిక్స్​లో ప్రచారమైన 'సేక్రెడ్​ గేమ్స్', రితేష్ బత్రా 'ఫొటోగ్రాఫ్'లతో అంతర్జాతీయ గుర్తింపు పొందాడు నవాజుద్దీన్. ప్రస్తుతం బాలీవుడ్​లో 'మోతీచూర్ ఛక్నాచూర్​' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. వచ్చే నెల 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది చదవండి: విక్టరీ వెంకటేశ్ చిత్రంలో నవాజుద్దీన్..!

ABOUT THE AUTHOR

...view details