తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సిద్దిఖీని మాయ చేసిన ఆ అమ్మాయి ఎవరు?' - ముస్తఫా సర్వార్ ఫరూకీ

బాలీవుడ్​ విలక్షణ నటుడు నవాజుద్దీన్​ సిద్దిఖీ రెండు కొత్త చిత్రాల్లో నటిస్తున్నాడు. గ్లెన్​ బ్యారెట్టో దర్శకత్వంలోని 'డస్టీ టూ మీట్​ రస్టీ', బంగ్లాదేశ్ దర్శకుడు ముస్తఫా సర్వార్ ఫరూకీ రూపొందిస్తున్న 'నో లాండ్స్ మెన్​'లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి సహనిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు.

సిద్దిఖీని మాయ చేసిన ఆ అమ్మాయి ఎవరు.?

By

Published : Apr 5, 2019, 5:21 PM IST

బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ వరుస సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా 'ఫొటోగ్రాఫ్' సినిమాతో ఆకట్టుకున్న ఈ హీరో త్వరలోనే మరో రెండు సినిమాల్లో నటించనున్నాడు. ఇందులో ఓ అంతర్జాతీయ చిత్రం ఉండటం విశేషం.

నవాజుద్దీన్​ సిద్దిఖీ ట్వీట్​
  • ఓ అమ్మాయి ముంబయి నుంచి ధర్మశాలకు తన చిన్ననాటి స్నేహం కోసం వెతుకుతూ.. దారిలోనే ప్రేమను కనుగొంటుందన్న కథాంశంగా 'డస్టీ టూ మీట్ రస్టీ' చిత్రం తెరకెక్కనుంది. గ్లెయిన్ బ్యారెట్టో దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో కీలక పాత్రలకు నటీనటులు ఇంకా ఖరారు కావల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి షూటింగ్​ ప్రారంభమవుతుందని వెల్లడించింది చిత్రబృందం .

అంతర్జాతీయ చిత్రంలోనూ..

నవాజుద్దీన్​ సిద్ధిఖీ అంతర్జాతీయ చిత్రంలో నటిస్తున్నారు. బంగ్లాదేశీ దర్శకుడు ముస్తఫా సర్వార్​ ఫరూకీ రూపొందిస్తున్న 'నో లాండ్స్​ మెన్'​లో ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఈ సినిమాలో నవాజ్​ దక్షిణాసియా వ్యక్తిగా కనిపించనున్నాడు. ఓ అమెరికా అమ్మాయి పరిచయంతో అతడి జీవితం ఎలా మారిందన్నదే కథాంశం.

ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అంశాలే సినిమాలో ఉంటాయి. హాస్యం, విమర్శ, భావోద్వేగం కలగలిపిన చిత్రమిది. ఇలాంటి సినిమాల్లో నటిస్తేనే నటుడిగా మరింత నిరూపించుకునే వీలుంటుంది. ఇలాంటి చిత్రాలనే నేను చేయాలని కోరుకుంటాను'
-- నవాజుద్దీన్​ సిద్దిఖీ, బాలీవుడ్ నటుడు

నవాజ్​ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'సేక్రెడ్​ గేమ్స్​' రెండో సీజన్​ విడుదలకు సిద్ధంగా ఉంది.

ABOUT THE AUTHOR

...view details