తెలంగాణ

telangana

ETV Bharat / sitara

భార్యకు లీగల్​ నోటీసు పంపిన నవాజుద్దీన్​ - భార్యకు లీగల్​ నోటీసు పంపిన నవాజుద్దీన్​

తన భార్య ఆలియాకు నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ లీగల్​ నోటీసులిచ్చారు.​ తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని కోరారు.

nawaz
నవాజ్​

By

Published : Jun 27, 2020, 8:31 AM IST

Updated : Jun 27, 2020, 11:58 AM IST

బాలీవుడ్​ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆయన భార్య ఆలియాకు లీగల్​ నోటిసు పంపించారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణల విషయంలో ఆమె వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. సమాజంలో కీర్తిప్రతిష్టలకు భంగం కలిగించటానికే ఉద్దేశపూర్వంగా, పక్కాప్రణాళికతోనే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుందని అన్నారు. ఈ విషయాన్ని నటుడు తరఫున న్యాయవాది వెల్లడించారు.

తన భర్త నవాజూద్దీన్​ నుంచి విడాకులు కావాలని మే7న కోర్టును ఆశ్రయించారు ఆలియా. అతడికి తనకు మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు.

ఈ మధ్య కాలంలో తమ పిల్లల పాఠశాల ఫీజులను నవాజుద్దీన్​ కట్టడం మానేశాడని ఆలియా ఆరోపించించారు. ఆర్థిక భారం వల్ల తాను చెల్లించలేకపోతున్నట్లు తెలిపారు. అయితే ఈ విషయాన్ని ఖండించిన నవాజ్​ న్యాయవాది.. పిల్లల పాఠశాల రుసుమును అతడు చెల్లిస్తున్నట్లు వెల్లడించారు.

ఇది చూడండి : కల్యాణ్​రామ్​ కొత్త సినిమాకు దర్శకుడు ఖరారు

Last Updated : Jun 27, 2020, 11:58 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details