ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ ఈనెల 15న ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామం బుధానాకు చేరుకున్నారు. తన స్వగ్రామంలోని ఈద్ వేడుకల కోసం ముంబయి నుంచి వచ్చారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు కరోనా టెస్టు చేయగా అందరికీ నెగటివ్ వచ్చింది. దీంతో మే 25 వరకు ఇంట్లోనే స్వీయనిర్బంధంలో ఉండాలని సిద్ధిఖీని అధికారులు కోరారు.
స్వీయ నిర్బంధంలో నవాజుద్దీన్ కుటుంబం - నవాజుద్దీన్ సిద్దిఖీ తాజా వార్తలు
ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ తన స్వగ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి అధికారులు కరోనా టెస్టు చేయగా అందిరికీ నెగటివ్ వచ్చింది. వేరే ప్రదేశం నుంచి రావడం వల్ల వారిని మే 25 వరకు ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు కోరారు.
నవాజుద్దీన్
ప్రస్తుతం 'ఘూమకేతు' అనే చిత్రంలో నటిస్తున్నారు నవాజుద్దీన్. పుష్పేంద్రనాథ్ మిశ్రా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, రణ్వీర్ సింగ్, సోనాక్షి సిన్హాలు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.