రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న నవాజుద్దీన్ సిద్దిఖీ చిత్రం 'బోలే చుడియన్'. ఇందులో 'స్వాగీ చుడియన్' అనే పాటకు మొదటిసారిగా గాత్రం అందిస్తున్నాడు నవాజ్. ఈ చిత్రంలో నవాజ్ సరసన తమన్నా కనిపించనుంది. ముందుగా మౌనీ రాయ్ ను హీరోయిన్ అనుకున్నా.. తర్వాత ఆమె స్థానంలో తమన్నాను తీసుకున్నారు.
గాయకుడిగా నవాజుద్దీన్ నయా రోల్ - నవాజుద్దీన్ సిద్దిఖీ
'గ్యాంగ్ ఆఫ్ వస్సీపుర్' సినిమాతో అద్భుత నటుడిగా పేరు తెచ్చుకున్నాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఈ బాలీవుడ్ నటుడు ప్రస్తుతం 'బోలే చుడియన్' లో నటిస్తున్నాడు. ఇప్పుటి వరకూ నటనతో అలరించిన నవాజ్ ఈ చిత్రంతో గాయకుడిగా పరిచయం కానున్నాడు.
![గాయకుడిగా నవాజుద్దీన్ నయా రోల్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3835363-866-3835363-1563091579509.jpg)
'బోలే చుడియన్' లో నవాజుద్దీన్ గాత్రం
పూర్తిగా రాజస్థాన్ లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవాజ్ సోదరుడు షమాస్ నవాబ్ దర్శకత్వం వహించనున్నాడు. 'ఉడ్‌పెక్కర్ మూవీస్' సంస్థ రాజేష్, కిరణ్ భాటియా నిర్మాతలుగా వ్యవహిరించనున్నారు. చిత్రనిర్మాతల్లో ఒకరైన అనురాగ్ కశ్యప్ ఓ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమా 2020 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: హాలీవుడ్ రైలు ఎక్కుతున్న పరిణీతి చోప్రా