వేలిముద్రలు దొంగిలించి హత్యలు చేస్తున్న హంతకున్ని పట్టుకునేందుకు ప్రయత్నించిన ఓ ప్రైవేట్ డిటెక్టివ్ కథతో తీసిన చిత్రం 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'. నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించాడు. గతేడాది చిన్న చిత్రంగా విడుదలై, పెద్ద విజయం సాధించింది. ఇప్పుడు దీనికి మరో రెండు భాగాలు తీసేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు. సీక్వెల్ స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు నిర్మాత రాహుల్ యాదవ్ వెల్లడించారు.
డబుల్ సీక్వెల్‌తో 'ఏజెంట్ ఆత్రేయ' రీఎంట్రీ - టాలీవుడ్ వార్తలు
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' సినిమాకు కొనసాగింపుగా మరో రెండు భాగాలు రానున్నాయని నిర్మాత రాహుల్ యాదవ్ వెల్లడించారు. ప్రస్తుతం కొనసాగింపు చిత్రం స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని తెలిపారు.
నవీన్ పోలిశెట్టి
మరోవైపు ఈ సినిమా హిందీ, తమిళ, మలయాళంలో రీమేక్ అవుతుంది. సెప్టెంబర్ 11న జపాన్ లో అనువాద చిత్రంగా విడుదల కానుంది.