తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ స్టార్​ హీరో సీక్రెట్​ బయటపెట్టిన సన్నీలియోనీ - sunnyleone romance with telugu hero

తెలుగు తెరపై హీరోగా నటించి గుర్తింపు తెచ్చుకున్న నవదీప్​పై ప్రశంసలు కురిపించింది స్టార్​ నటి సన్నీలియోని. ఇటీవల ఓ వెబ్​సిరీస్​ కోసం అతడితో షూటింగ్​లో పాల్గొన్న ఆమె... అతడు చాలా మంచోడని కితాబిచ్చింది.

సన్నీ

By

Published : Oct 11, 2019, 9:15 PM IST

తెలుగులో చాలా సినిమాల్లో సహాయ నటుడిగా, హీరోగా నటించాడు నవదీప్‌. గౌతమ్‌ ఎస్‌.ఎస్‌.సి’ చిత్రంతో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడీ యువహీరో. ప్రస్తుతం బాలీవుడ్‌ నటి సన్నీ లియోనితో కలిసి ఓ వెబ్‌సీరీస్‌లో నటిస్తున్నాడు. ఈ శృంగార తార నటించిన 'రాగిణి ఎంఎంఎస్‌' వెబ్‌ సీరీస్‌ రెండో సీజన్లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు నవదీప్​.

ఇప్పటికే తెలుగులోనూ కొన్ని వెబ్‌ సిరీస్‌ల్లో నటించిన ఈ హీరో.. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఈ ప్రాజెక్టు గురించి వెళ్లడిస్తూ... నవదీప్‌తో కలిసి తీసుకున్న ఫొటోను అభిమానులతో పంచుకుంది సన్నీ.

"ఓ మంచి వ్యక్తితో కలిసి పనిచేస్తున్నా" అని అతడికి సర్టిఫికెట్‌ కూడా ఇచ్చేసింది. మొత్తం మీద టాలీవుడ్‌ సెక్సీ బాయ్‌, బాలీవుడ్‌ హాట్‌బాంబ్‌ కలిసి డిజిటల్​ తెరపై సందడి చేయనున్నారు. నవదీప్‌ ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వస్తున్న 'అల వైకుంఠపురములో' చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇవీ చూడండి.. సూర్య 'బందోబస్త్‌'కు 100 కోట్లు

ABOUT THE AUTHOR

...view details