కోలీవుడ్ స్టార్స్ సూర్య, విజయ్ సేతుపతి, సిద్ధార్థ్, అరవిందస్వామి, అశోక్ సెల్వన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ 'నవరస'. శుక్రవారం(ఆగస్టు 7) నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సినీప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్.. ఈ సిరీస్‌లోని పాత్రలకు చెందిన వీడియోలను దుబాయ్‌లోని ప్రఖ్యాత కట్టడం బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించింది. ప్రపంచ వేదికపై తమిళ సినిమా గొప్పతనాన్ని చాటిచెప్పడం ఈ ప్రదర్శన లక్ష్యమని సంస్థ వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది.
Navarasa: బుర్జ్ ఖలీఫాపై 'నవరస' - నవరస దుబాయ్ బూర్జ్ ఖలీఫా
ప్రపంచంలోనే ఎత్తైన టవర్ బుర్జ్ ఖలీఫాపై 'నవరస' వెబ్‌సిరీస్ వీడియోను ప్రదర్శించారు. తమిళ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
నవరస
ఈ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి దర్శకుడు మణిరత్నం నిర్మించారు. మనిషిలోని ప్రధాన హావభావాలు కోపం, కరుణ, ధైర్యం, అసహ్యం, భయం, నవ్వు, ప్రేమ, శాంతి, ఆశ్చర్యం వంటి వాటిని ప్రధానంగా చేసుకుని రూపొందించిన వెబ్‌సిరీస్ ఇది. కరోనా కారణంగా నష్టపోయిన తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ కార్మికులను ఆదుకోవడమే లక్ష్యంగా దీన్ని రూపొందించారు.
ఇదీ చూడండి: Navarasa: సినీ కార్మికుల కోసమే ఈ 'నవరస'