Navadeep New Movie: 'జై' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటుడు నవదీప్. హీరోగా తనదైన శైలిని సృష్టించుకొని తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు. యూత్‌ను ఆకట్టుకునే చిత్రాల్లో నటించి లవర్‌బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. కానీ, గత కొన్నాళ్లుగా నవదీప్ ప్రధాన పాత్రల్లో కనిపించట్లేదు. టాలీవుడ్ టాప్ హీరోల సినిమాల్లో సహాయ పాత్రలు చేస్తూ వస్తున్నాడు.
కాగా.. ఇప్పుడు నవదీప్ మళ్లీ కథానాయకుడిగా మారాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'లవ్ మౌళి'. నూతన దర్శకుడు అవనీంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫంఖురి గిడ్వాని కథానాయిక. ఇవాళ (జనవరి 26) నవదీప్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి మోషన్ పోస్టర్‌ను నటుడు రానా దగ్గుబాటి సోషల్‌మీడియా వేదికగా విడుదల చేశారు.
ఇందులో నవదీప్ పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో మాస్ లుక్‌తో కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్ బ్యానర్‌పై ప్రశాంత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. గోవింద్ వసంత సంగీతం సమకూరుస్తున్నారు.