భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిస్తూ నిర్మించిన 'నాట్యం' చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. గోవాలో ఈ నెల 20 నుంచి 28 వరకు జరుగనున్న 52వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో తెలుగు నుంచి ఎంపికైన ఏకైక చిత్రంగా నిలిచింది. కేంద్ర ప్రసార సమాచార మంత్రిత్వ శాఖ ఈ మేరకు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. దీంతో హర్షం వ్యక్తం చేసిన చిత్ర బృందం.. జ్యూరీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.
'నాట్యం'కు అరుదైన గౌరవం.. చిత్రబృందం ఫుల్ హ్యాపీ
కూచిపూడి నృత్య నేపథ్య కథతో తీసిన 'నాట్యం' సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. తెలుగు నుంచి ఈ ఏడాదికిగానూ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ప్రదర్శనకు ఎంపికైన ఏకైక చిత్రంగా నిలిచింది.
నాట్యం మూవీ
నూతన దర్శకుడు రేవంత్ కోరుకొండ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన 'నాట్యం' ఎంతో మంది సినీ ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలందుకొని బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో 'నాట్యం' ప్రదర్శనకు ఎంపిక కావడం పట్ల చిత్ర దర్శక నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కూడా 'నాట్యం' బృందాన్ని ప్రశంసించింది.
ఇవీ చదవండి: