తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాని వాల్​పోస్టర్​ నుంచి  'హిట్​' సినిమా - tollywood movie news

నేచురల్​ స్టార్​ నాని నిర్మాణంలో మరో ప్రాజెక్టు మొదలైంది. గతంలో తన ప్రొడక్షన్​ హౌస్​ వాల్​పోస్టర్​ సినిమా నుంచి 'అ!' అనే విభిన్న కథ తెరకెక్కింది. తాజాగా ఇదే నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో 'హిట్'​ అనే చిత్రానికి నేడు కొబ్బరికాయ కొట్టేశాడు.

నాని వాల్​పోస్టర్​ నుంచి 'హిట్​' సినిమా..!

By

Published : Oct 24, 2019, 12:54 PM IST

కొత్త కథానాయకులు, దర్శకులతో విభిన్న కథాంశాలు తెరకెక్కిసున్నాడు హీరో​ నాని. ఈ నేచురల్​ స్టార్​కు చెందిన ప్రొడక్షన్‌ హౌస్‌ 'వాల్‌పోస్టర్‌ సినిమా' నుంచి గతంలో 'అ!' అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఇదే బ్యానర్​పై రెండో చిత్రానికి నేడు పూజా కార్యక్రమాలు నిర్వహించింది చిత్రబృందం.

పూజా కార్యక్రమాల్లో చిత్రబృందంతో నాని

'హిట్‌ ది ఫస్ట్‌ కేస్‌' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శైలేష్‌ కొలను దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఈ నగరానికి ఏమైంది, ఫలక్​నుమా దాస్​ చిత్రాల్లో నటించిన విశ్వక్‌సేన్‌ కథానాయకుడు. రుహాని శర్మ కథానాయిక. ప్రశాంతి తిపిర్నే‌ని నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. వివేక్​ సాగర్​ బాణీలు సమకూర్చనున్నాడు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను నాని సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ఈరోజు నుంచి ప్రారంభమైంది.

హిట్​ సినిమా పోస్టర్​

తొలిసారి వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై వచ్చిన 'అ!' సినిమాకు నాని నిర్మాతగా వ్యవహరించాడు. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో... కాజల్‌, నిత్యామేనన్‌, రెజీనా, అవసరాల శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

ABOUT THE AUTHOR

...view details