తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'బాలీవుడ్​ ఎంట్రీకి నేను సిద్ధమే.. కానీ!' - నాని బాలీవుడ్​ ఎంట్రీపై క్లారిటీ

సరైన కథ దొరికితే బాలీవుడ్​ ఎంట్రీ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తన మనసులో మాట బయటపెట్టారు నేచురల్​ స్టార్​ నాని. అయితే తనకు వచ్చిన హిందీతో అక్కడ సినిమాలు చేయడం కష్టమని.. ఏది ఏమైనా మంచి కథతో దర్శకుడు దొరికితే సినిమా చేస్తానని క్లారిటీ ఇచ్చారు.

Natural Star Nani opens about bollywood entry
'బాలీవుడ్​ ఎంట్రీకి నేను సిద్ధమే.. కానీ!'

By

Published : May 9, 2021, 12:04 PM IST

దక్షిణాది నటులకు బాలీవుడ్‌ అంటే కొంచెం క్రేజ్‌ ఎక్కువే. అందుకే.. తమ ఇండస్ట్రీల్లో కావాల్సినంత గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత బాలీవుడ్‌లోకి ప్రవేశించాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. అందుకు టాలీవుడ్‌ పరిశ్రమ అతీతం కాదు. మన స్టార్‌ హీరోల్లో చాలామంది హిందీలో చేసినవాళ్లున్నారు. అయితే.. ఇప్పటివరకూ బాలీవుడ్‌లో అడుగుపెట్టని స్టార్‌ హీరో నాని బీటౌన్‌ ప్రవేశంపై తన మనసులోని మాట బయటపెట్టారు.

బాలీవుడ్‌ సినిమా చేయాలనే ఆలోచన తనకు ఎప్పటి నుంచో ఉందని, అయితే.. తనకు వచ్చిన హిందీతో బాలీవుడ్‌లో రాణించడం కష్టమని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఏదేమైనా.. మంచి కథతో పాటు డైరెక్టర్‌ దొరికితే తప్పకుండా బాలీవుడ్‌లో సినిమా చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.

తన సహజమైన నటనతో తక్కువ కాలంలోనే ఎంతోమంది అభిమానం సొంతం చేసుకున్నారు హీరో నాని. కొత్తతరహా కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నాని నటించిన 'టక్‌ జగదీష్‌' విడుదలకు సిద్ధంగా ఉంది. అన్నదమ్ముల కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జగపతిబాబు కీలకపాత్ర పోషించారు. రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

దీంతో పాటు నాని, సాయి పల్లవి జంటగా రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వంలో 'శ్యామ్‌ సింగరాయ్‌' తెరకెక్కుతోంది. కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియిన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే.. 'జెర్సీ' సినిమాతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించాడు. ఇప్పుడు ఆ చిత్రం అక్కడ రీమేక్‌ అవుతోంది.

ఇదీ చూడండి:కరోనా కారణంగా లైగర్​ టీజర్​ రిలీజ్​ వాయిదా

ABOUT THE AUTHOR

...view details