తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కరోనాను లెక్కచేయని నాని- మరో చిత్రానికి గ్రీన్​ సిగ్నల్​ - నాని వివేక్​ ఆత్రేయ కొత్త సినిమా

ప్రతి ఏడాది రెండు నుంచి మూడు సినిమాలతో సినీ అభిమానులకు ఆకట్టుకునే హీరో నేచురల్​ స్టార్​ నాని. ఇప్పటికే విడుదలకు సిద్ధమైన 'వి' చిత్రం లాక్​డౌన్​ కారణంగా వాయిదా పడింది. మూడు చిత్రాలు చేతిలో ఉండగా తన తర్వాతి ప్రాజెక్టుపై తాజాగా క్లారిటీ ఇచ్చాడు నాని. 'బ్రోచేవారెవరురా' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందిన వివేక్​ ఆత్రేయ దర్శకత్వంలో నటించనున్నాడు.

Natural Star Nani new movie confirmed with director Vivek Atreya
నేచురల్​ స్టార్​ ఖాతాలో నాలుగో సినిమా

By

Published : May 12, 2020, 7:35 AM IST

'వి', 'టక్‌ జగదీష్‌', 'శ్యామ్‌ సింగరాయ్‌'... యువ కథానాయకుడు నాని కొత్త సినిమాల జాబితా ఇది. అంతా అనుకున్నట్టు జరిగుంటే ఈ ఏడాదిలోనే ఈ మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చేవి. కానీ కరోనాతో వచ్చిన విరామం అన్ని సినిమాలపైనా ప్రభావం చూపించింది. అయినా సరే... నాని ఈ ఏడాది మరో కొత్త సినిమా ముచ్చటని వినిపించబోతున్నారు.

యువ దర్శకుడు వివేక్‌ ఆత్రేయ చెప్పిన కథ నానికి నచ్చింది. ఈ ఏడాది చివరలో వీరి కలయికలో సినిమా ఆరంభం కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించబోతోంది. 'మెంటల్‌ మదిలో', 'బ్రోచేవారెవరురా' చిత్రాలతో ఆకట్టుకున్న వివేక్‌ ఆత్రేయతో నాని సినిమా చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

నాని, వివేక్​ ఆత్రేయ

ఈ ఏడాది మార్చిలో విడుదలవ్వాల్సిన 'వి' సినిమా కరోనా లాక్​డౌన్​ కారణంగా వాయిదా పడింది. ఇందులో నాని నెగటివ్​రోల్​ పోషించారు. మరో చిత్రం 'టక్​ జగదీష్​'లో నేచురల్​ స్టార్​ భగ్న ప్రేమికుడిగానూ పోలీస్​ పాత్రలో కనువిందు చేయనున్నాడని సమాచారం. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్​ నటిస్తున్నారు.

ఇదీ చూడండి.. ట్వీట్‌తో కొత్త చిత్రంపై క్లూ ఇచ్చేశాడా!

ABOUT THE AUTHOR

...view details