తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జాతీయ సినీ పురస్కారాలకు ఎన్నికల బ్రేక్ - national film awards

66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఎన్నికల తర్వాత ప్రకటించనున్నట్లు వెల్లడించింది సమాచార, ప్రసార శాఖ. ప్రస్తుతం ఎన్నికల కోడ్​ అమలులో ఉండటమే కారణమని స్పష్టం చేసింది.

జాతీయ సినీ పురస్కారాలకు ఎన్నికల హీట్​

By

Published : Apr 24, 2019, 3:45 PM IST

జాతీయ చలనచిత్ర అవార్డులను మే నెల తర్వాతే ప్రకటించనుంది ప్రభుత్వం. ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉండడమే ఇందుకు కారణం.

ప్రత్యేకమైన జ్యూరీ సభ్యులు సినీ రంగంలో కృషి చేసిన, ప్రతిభ చూపించిన వ్యక్తులకు ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. వీటిని ప్రతి ఏడాది ఏప్రిల్​లో ప్రకటించేవారు. అయితే 17వ లోక్​సభ ఎన్నికల తరుణంలో అవార్డుల ప్రకటనను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది సమాచార, ప్రసార శాఖ.

ప్రభుత్వం విడుదల చేసిన నోట్​

'ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉంది. అయితే ఈ అవార్డులను రాజకీయంగా వాడుకునే అవకాశం ఉంది. మీడియా ప్రభావం పెరుగుతుంది. కాబట్టి ఎన్నికల తర్వాత అవార్డులు ప్రకటిస్తాం' అని ఉత్తర్వుల​లో వివరించింది ప్రభుత్వం.

ఎన్నికల ప్రవర్తన నియమావళి మే 23న తుది ఫలితాలు వచ్చే వరకు అమలులోనే ఉంటుంది. ఈ తేదీ తర్వాతే అవార్డుల ప్రకటన తేదీ వెలువడనుంది.

ABOUT THE AUTHOR

...view details