'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్లో బామ్మగా నటించి, గుర్తింపు తెచ్చుకున్న సురేఖా సిక్రీ(75) తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించినట్లు ఆమె సహాయకుడు వివేక్ సిద్వానీ వెల్లడించారు.
గతేడాది సెప్టెంబర్‌లో బ్రెయిన్‌స్ట్రోక్‌తో ఆస్పత్రిలో చేరిన సురేఖ.. కొన్నిరోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. కానీ అప్పటినుంచి ఇతరత్రా అనారోగ్య సమస్యలతో బాధపడ్డారని వివేక్ చెప్పారు.