మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 'మా' ఎన్నికల కారణంగా గత కొన్నినెలల క్రితం తెలుగు చిత్రపరిశ్రమలో రాజుకున్న వేడి ఇంకా చల్లారలేదు. ఎన్నికల్లో విజయం సాధించిన మంచు విష్ణు ప్యానెల్‌కు సపోర్ట్‌గా నిలిచిన నరేశ్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. అంతేకాకుండా, ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన 11 మంది సభ్యులు.. తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వాడీవేడీ ఆరోపణల మధ్య నటుడు మంచు విష్ణు బుధవారం ఉదయం 'మా' అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు అయ్యాక కూడా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? అంటూ నరేశ్ ప్రశ్నించారు.
Maa elections 2021: విష్ణును డిస్టర్బ్ చేస్తే బాగుండదు: నరేశ్ - ప్రకాశ్‌రాజ్ మంచు విష్ణు
ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ రాజీనామాలు చేయడంపై 'మా' మాజీ అధ్యక్షుడు నరేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎందుకీ ఆరోపణలు అంటూ వ్యాఖ్యానించారు.
"ఈ రోజు నాకెంతో ఆనందంగా ఉంది. తదుపరి 'మా' అధ్యక్షుడిగా విష్ణుకు బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉంది. 'మా' ఒక సేవా సంస్థ. అందరం కలిసి సమష్టిగా పనిచేద్దాం. కొత్త పాలకవర్గాన్ని ప్రశాంతంగా పనిచేసుకోనివ్వండి. విష్ణును ఎవరైనా డిస్టర్బ్ చేస్తే బాగుండదు. ఎన్నికల సమయంలో అందరం కలిసి పనిచేద్దామని చెప్పి.. ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు. మోదీ గెలిచారని కాంగ్రెస్ దేశం వదిలి వెళ్లిపోలేదు కదా! 'మా' సభ్యులెవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఎన్నికలయ్యాక కూడా ఈ ఆరోపణలు ఎందుకు?" అని నరేశ్ కామెంట్ చేశారు.
ఇవీ చదవండి: