తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఆయన మరణం చిత్రసీమకు తీరని లోటు' - అజయ్ దేవగణ్

ఇటీవల మరణించిన బాలీవుడ్ నటుడు, యాక్షన్ కొరియోగ్రాఫర్ వీరూ దేవగణ్ మృతి పట్ల​ ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన కుటుంబాన్ని ఓదారుస్తూ ఓ లేఖ పంపించారు.

'ఆయన మరణం చిత్రసీమకు తీరని లోటు'

By

Published : Jun 2, 2019, 6:21 PM IST

బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ తండ్రి వీరూ దేవగణ్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తూ భారత ప్రధాని నరేంద్రమోదీ ఓ లేఖ రాశారు.

"బాలీవుడ్‌లో గొప్ప పేరు ప్రతిష్ఠలు సంపాదించుకున్న వీరూ దేవగణ్‌ చనిపోయారని తెలిసి చాలా చింతించాను. ఆయన మరణం చిత్రపరిశ్రమకు తీరని లోటు. స్టంట్‌మ్యాన్‌గా, యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు ఆయన. వృత్తిపై గౌరవంతో ఎన్నో కొత్త విధానాలను ఆవిష్కరించి వెండితెరకు పరిచయం చేశారు. ఆయన గొప్ప ధైర్యవంతుడు. ఓ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా సాహసోపేతమైన స్టంట్లు చేయడమే కాకుండా తనతో పాటు పనిచేసిన వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. ఆయన్ని చిత్ర పరిశ్రమలో అందరూ ఎంతో ప్రేమిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. విజువల్ ఎఫెక్ట్స్‌ లేని సమయంలోనే ప్రేక్షకుల్ని అలరించేందుకు రిస్క్‌ తీసుకునేవారు. చిత్రసీమకు ఆయన చేసిన సేవలు చిరకాలం గుర్తుండిపోతాయి. వీరూ దేవగణ్‌ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. వీరూ దేవగణ్‌ ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే మనం తీసుకునే రిస్క్‌ని బట్టే మన ప్రపంచం పయనిస్తుంది" -లేఖలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లేఖ

ABOUT THE AUTHOR

...view details