దీపిక, రకుల్, శ్రద్ధలకు ఎన్సీబీ సమన్లు - Deepika Padukone news
17:39 September 23
వచ్చే మూడురోజుల్లో విచారణకు హాజరు
సుశాంత్ సింగ్ మృతి కేసులో డ్రగ్స్ కోణంపై దర్యాప్తు చేస్తున్న మాదక ద్రవ్యాన నియంత్రణ సంస్థ.. ప్రముఖ నటి దీపికా పదుకొణెకు సమన్లు జారీ చేసింది. ఆమెతో పాటు శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌లకు కూడా సమన్లు జారీ చేసింది.
వచ్చే మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని హీరోయిన్లకు ఎన్సీబీ ఆదేశించింది. ఈ కేసులో డ్రగ్స్ కోణంపై దర్యాప్తునకు ఎన్సీబీ రంగంలోకి దిగినప్పటి నుంచి పలువురు బాలీవుడ్ నటీమణుల పేర్లు బయటకు వచ్చాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు దీపికకు సమన్లు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌ను టాలెంట్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ జయా సాహాను ఎన్సీబీ ప్రశ్నిస్తోంది.