బాలీవుడ్‌లో ప్రముఖ హాస్యనటి, టీవీ వ్యాఖ్యాత భారతీ సింగ్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అరెస్ట్ చేసింది. ఉదయం భారతీసింగ్ కార్యాలయం, నివాసంలో సోదాలు నిర్వహించామని... వాటిల్లో 86.5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. అనంతరం భారతీసింగ్, అమె భర్త హర్ష్ లింబాచియాను ముంబయిలోని కార్యాలయానికి తీసుకెళ్లి విచారించామని తెలిపారు. వారిద్దరూ గంజాయి తీసుకుంటున్నట్లు ఎన్‌సీబీ బృందం ఎదుట అంగీకరించారని.. ఈ నేపథ్యంలో భారతీ సింగ్‌ను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.
డ్రగ్స్ కేసులో ప్రముఖ హాస్యనటి అరెస్టు - డ్రగ్స్ కేసులో ప్రముఖ హాస్యనటి అరెస్టు
ప్రముఖ హాస్యనటి భారతీ సింగ్‌ను ఇవాళ అరెస్ట్ చేసింది ఎన్‌సీబీ. డ్రగ్స్ కేసులో విచారణ అనంతరం ఈ చర్యలు తీసుకున్నారు అధికారులు. గంజాయి సేవించినట్లు భారతీసింగ్, ఆమె భర్త అంగీకరించినట్లు సమాచారం.
డ్రగ్స్ కేసులో ప్రముఖ హాస్యనటి అరెస్టు
సుశాంత్ సింగ్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్‌లో చెలరేగిన మాదకద్రవ్యాల వినియోగం కేసు కలకలం కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు నటులను ఎన్‌సీబీ విచారించింది.