తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నారప్ప' షూటింగ్​ పూర్తి.. 'రిపబ్లిక్​', 'చక్ర' రిలీజ్​ డేట్స్​ - జాంబిరెడ్డి ప్రీరిలీజ్​ ఈవెంట్

టాలీవుడ్​లో కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. విక్టరీ వెంకటేష్​ 'నారప్ప' సహా 'చక్ర' రిలీజ్​ డేట్​, కార్తి నూతన చిత్రం 'సుల్తాన్​' టీజర్​ అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి.

'Narappa' wraps up shoot.. 'Republic', 'Chakra' movies release dates were Fixed
'నారప్ప' షూటింగ్​ పూర్తి.. 'రిపబ్లిక్​', 'చక్ర' రిలీజ్​ డేట్స్​

By

Published : Feb 1, 2021, 7:02 PM IST

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'నారప్ప'. తమిళ బ్లాక్‌బస్టర్‌ 'అసురన్‌'కు ఇది రీమేక్‌. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. మే 14న థియేటర్లలో కనిపించబోతున్న 'నారప్ప' షూటింగ్‌ పూర్తి చేసుకున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. చివరి రోజుకు సంబంధించి కొన్ని ఫొటోలను నెటిజన్లతో పంచుకుంది.

'నారప్ప' షూటింగ్​ పూర్తి చేసుకున్న చిత్రబృందం

తమిళంతో పాటు, తెలుగులోనూ క్రేజ్‌ సొంతం చేసుకున్న కథానాయకుడు విశాల్‌. తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఆయన కథలను ఎంపిక చేసుకుంటారు. ఎం.ఎస్‌.ఆనందన్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'చక్ర'. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. రెజీనా కీలక పాత్ర పోషించింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.

'చక్ర' సినిమా రిలీజ్​ పోస్టర్​

వెంకటేష్​-వరుణ్​ తేజ్​ కలిసి నటిస్తోన్న చిత్రం 'ఎఫ్​ 3'. ఈ సినిమా షూటింగ్​ శరవేగంగా జరుపుకొంటోంది. ఇప్పుటికే చిత్రీకరణలో వెంకీ, వరుణ్​ పాల్గొనగా.. ప్రస్తుతం నటి తమన్నా వచ్చి చేరింది. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్​ రావిపూడి ట్విట్టర్​లో ఫొటోను షేర్​ చేశారు.

'ఎఫ్​ 3' షూటింగ్​లో పాల్గొన్న వెంకటేశ్​, తమన్నా తదితరులు

కోలీవుడ్​ నటుడు కార్తి ప్రధానపాత్రలో బక్కియారాజ్​ కన్నన్​ దర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం 'సుల్తాన్​'. సోమవారం చిత్రానికి సంబంధించిన టీజర్​ను విడుదల చేసింది చిత్రబృందం. రష్మిక కథానాయిక.

మెగా హీరో సాయితేజ్​- దర్శకుడు దేవకట్టా కాంబినేషన్​లో రూపొందుతోన్న చిత్రం 'రిపబ్లిక్​'. ఇటీవలే విడుదలైన మోషన్​ పోస్టర్​ మంచి స్పందన దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను జూన్​ 4న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

'రిపబ్లిక్​' సినిమా రిలీజ్​ పోస్టర్​

బాలనటుడు తేజా సజ్జా హీరోగా పరిచయమవుతోన్న చిత్రం 'జాంబిరెడ్డి'. ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రీ-రిలీజ్​ ఈవెంట్​ను నిర్వహించనుంది చిత్రబృందం. దీనికి ముఖ్యఅతిథిగా హీరో వరుణ్​తేజ్​ రానున్నారు.

'జాంబిరెడ్డి' ప్రీ-రిలీజ్​ ఈవెంట్​కు ముఖ్యఅతిథిగా వరుణ్​తేజ్​

ఇదీ చూడండి:హాస్య'బ్రహ్మా'కు సినీప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

ABOUT THE AUTHOR

...view details