తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అసురన్' మ్యాజిక్ 'నారప్ప' రిపీట్ చేస్తుందా? - నారప్ప అసురన్ పోలీకలు

విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'నారప్ప'. తమిళ సినిమా 'అసురన్'​కు రీమేక్​గా రూపొందుతోంది. వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ చిత్ర టీజర్​ను విడుదల చేశారు. ఈ వీడియో చూసి కోలీవుడ్​ మ్యాజిక్​ను 'నారప్ప' ఇక్కడా రీపీట్ చేయనుందని అందరూ భావిస్తున్నారు.

Narappa teaser out.. fans says its treat to watch
'అసురన్' వసూళ్ల సునామీ 'నారప్ప' రిపీట్ చేస్తుందా?

By

Published : Dec 14, 2020, 5:07 PM IST

విక్టరీ వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'నారప్ప'. తమిళంలో ఘనవిజయం అందుకున్న 'అసురన్' సినిమాకు ఇది రీమేక్. కథకు తెలుగు నేటివిటీని అందించి సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్రబృందం ఇప్పటికే తెలిపింది. తాజాగా విడుదలైన టీజర్లో వెంకీ మాస్​ లుక్ అదిరిపోయింది. చాలా ఏళ్ల తర్వాత వెంకటేశ్​ను పూర్తి మాస్​ పాత్రలో చూస్తున్నందుకు ప్రేక్షకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్​ను మరోసారి చూసేయండి.

తమిళంలో భారీ వసూళ్లు

ధనుష్ హీరోగా తెరకెక్కిన 'అసురన్'.. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. ధనుష్ నటన, వెట్రిమారన్ టేకింగ్, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్. ప్రతి సీన్​ ప్రేక్షకుడిని థ్రిల్​కు గురి చేస్తుంది. దీంతో కోలీవుడ్​లో దాదాపు 150 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది.

అసురన్నారప్ప
హీరో ధనుష్ వెంకటేశ్
దర్శకుడు వెట్రిమారన్ శ్రీకాంత్ అడ్డాల
సంగీతం జీవీ ప్రకాశ్ కుమార్ మణిశర్మ

ABOUT THE AUTHOR

...view details