*విక్టరీ వెంకటేశ్ 'నారప్ప'గా మన ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్(నిర్మాణనంతర పనులు) తాజాగా పూర్తవగా, తొలి కాపీ ఈ వారంలో రానుంది. త్వరలో విడుదల తేదీపైనా స్పష్టత ఇవ్వనున్నారు.
*ప్రముఖ సంగీత దర్శకుడు తమన్.. 'అల అమెరికాపురములో' పేరుతో ఆగస్టు-సెప్టెంబరు మధ్య మ్యూజికల్ కన్సర్ట్ నిర్వహించనున్నారు. యూఎస్‌లోని వాషింగ్టన్ డీసీ, షికాగో, న్యూజెర్సీ, షాన్ జోష్, డల్లాస్ నగరాల్లో ఈ ఈవెంట్లను జరపనున్నారు.