తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'నారప్ప' తొలి లిరికల్.. నవ్విస్తున్న 'స్టాండప్ రాహుల్' టీజర్ - స్టాండప్ రాహుల్ టీజర్

కొత్త సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో నారప్ప, లాల్ సింగ్ చద్దా, స్టాండప్ రాహుల్, భూత్ పోలీస్ చిత్రాల సంగతులు ఉన్నాయి.

NARAPPA, LAAL SINGH CHADDHA, STAND UP RAHUL, BHOOT POLICE MOVIE UPDATES
మూవీ న్యూస్

By

Published : Jul 9, 2021, 4:58 PM IST

*విక్టరీ వెంకటేశ్​ 'నారప్ప' నుంచి అప్డేట్స్ వచ్చింది. 'చలాకీ చిన్మమ్మి' అంటూ సాగే తొలి లిరికల్​ సాంగ్​ను జులై 11న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. తొలుత జులై 24న ప్రైమ్​లో రానుందని ప్రచారం జరిగింది. ఏపీ, తెలంగాణలో థియేటర్లు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు థియేటర్లలోనే 'నారప్ప' సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. తమిళ సూపర్​హిట్ 'అసురన్' రీమేక్​గా దీనిని తెరకెక్కించారు.

నారప్ప తొలి లిరికల్ పోస్టర్

*ఆమిర్​ఖాన్ 'లాల్​సింగ్ చద్దా' షూటింగ్ ప్రస్తుతం లద్దాఖ్​లో జరుగుతుంది. ఇందులో టాలీవుడ్ హీరో నాగచైతన్య ఆర్మీ అధికారిగా నటిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణకు హాజరైన చైతూ.. సెట్​లో ఆమిర్​తో దిగిన ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్ చేశారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాలీవుడ్​ సినిమా 'ఫారెస్ట్ గంప్'కు రీమేక్​గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఆమిర్​ఖాన్​తో నాగచైతన్య

*రాజ్​తరుణ్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'స్టాండప్ రాహుల్'. ఈ సినిమా టీజర్​ను హీరో రానా.. శుక్రవారం విడుదల చేశారు. స్టాండప్ కామెడీ నేపథ్య కథతో, రొమాంటిక్ ఎంటర్​టైనర్​గా దీనిని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. సాంటో దర్శకత్వం వహించారు. త్వరలో చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు.

*బాలీవుడ్​ హారర్​ ఎంటర్​టైనర్​ 'భూత్ పోలీస్'. ఈ సినిమా సెప్టెంబరు 17న డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో విడుదల చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. పోస్టర్​ను కూడా విడుదల చేశారు. ఇందులో సైఫ్​అలీఖాన్, అర్జున్​ కపూర్, యామీ గౌతమ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్​ ప్రధాన పాత్రలు పోషించారు. పవన్ క్రిపలానీ దర్శకుడు.

భూత్ పోలీస్ మూవీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details