విక్టరీ వెంకటేశ్ 'నారప్ప' సినిమాలోని 'రేజ్ ఆఫ్ నారప్ప' లిరికల్ సాంగ్ విడుదలైంది. ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన ఈ చిత్రం.. అభిమానుల్ని అలరిస్తోంది. తమిళ బ్లాక్‌బస్టర్ 'అసురన్'కు రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు.
సూర్య కొత్త సినిమా 'ఎత్రక్కుమ్ తునిందవన్'. అతడి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన రెండో లుక్ ఆకట్టుకుంటోంది. పొలాచ్చి గ్యాంగ్‌రేప్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించింది.