Narappa actor karthik Engagement: 'నారప్ప' సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ రత్నం త్వరలో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకోనున్నాడు. ఈ మేరకు వీరి నిశ్చితార్థం శనివారం.. నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో వేడుకగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు నటుడు నవీన్ చంద్ర హాజరయ్యాడు. వధూవరులకు అభినందనలు తెలిపాడు.
పెళ్లిపీటలెక్కనున్న మరో టాలీవుడ్ నటుడు.. గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ - నటుడు కార్తిక్ నిశ్చితార్థం
Narappa actor karthik Engagement: 'కేరాఫ్ కంచరపాలెం', 'నారప్ప', 'అర్ధ శతాబ్దం' సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ రత్నం త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నాడు. హెదరాబాద్కు చెందిన ఓ అమ్మాయితో అతడి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. పలువురు నటులు ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు.
![పెళ్లిపీటలెక్కనున్న మరో టాలీవుడ్ నటుడు.. గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ Actor Karthik engazement](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14651837-thumbnail-3x2-actor.jpg)
ఘనంగా నటుడు కార్తీక్ రత్నం నిశ్చితార్థం
థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఆరంభించిన కార్తీక్.. 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా విజయం సాధించినప్పటికీ కార్తీక్‌కు అనుకున్నంత గుర్తింపు లభించలేదు. అనంతరం హీరోగా చేసిన 'అర్ధ శతాబ్దం' మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఇటీవల విడుదలైన 'నారప్ప'లో వెంకటేశ్ పెద్దకుమారుడి పాత్రలో కార్తీక్ నటించి మెప్పించారు.
ఇదీ చూడండి: ధనుష్ వల్లే ఆ ఛాన్స్ వచ్చింది: హ్యూమా ఖురేషీ