టాలీవుడ్ హీరో నారా రోహిత్.. కొత్త లుక్‌తో అదరగొట్టాడు. బొద్దుగా ఉన్న ఇతడు.. ఇటీవలే ఫిట్‌గా మారి, కోర మీసంతో కనువిందు చేశాడు. ఈ ఫొటోను తాజాగా ఇన్‌స్టాలో పంచుకున్నాడు. అయితే తను ఇలా ఎందుకు మారాల్సి వచ్చిందో.. ఈ మధ్య కాలంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
పాతలుక్ తనకు తాను అసలు నచ్చలేదని, అందుకే ఫిట్‌గా కనిపించేందుకు ఏడాది నుంచి కసరత్తులు చేస్తూ ఇలా మారినట్లు రోహిత్ తెలిపాడు. లాక్‌డౌన్‌తో జిమ్ మూతపడటం వల్ల ఇంట్లోనే డైట్ పాటిస్తూ వ్యాయామాలు చేస్తున్నట్లు వెల్లడించాడు.
నారా రోహిత్.. ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం, ఇదే రోజు తనపై తొలి షాట్ తీశారని చెబుతూ, అందుకు సంబంధించిన ఓ ఫొటోను పంచుకున్నాడు. పెదనాన్న చంద్రబాబు, అన్న లోకేశ్‌తో కలిసి ట్విట్టర్లో ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు.
'బాణం' సినిమాతో టాలీవుడ్లోకి అరంగేట్రం చేశాడు రోహిత్. 'సోలో'తో గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం వైవిధ్యభరిత చిత్రాల్లో నటిస్తూ, మెప్పించాడు. గతకొద్ది కాలం నుంచి నటనకు దూరంగా ఉన్న ఇతడు.. చివరిసారిగా 2018లో వచ్చిన 'వీరభోగవసంత రాయులు'లో కనిపించాడు. ప్రస్తుతం 'అనగనగా దక్షిణాదిలో', 'శబ్దం', 'పండగలా వచ్చాడు', 'మదరాసి' ప్రాజెక్టులు చేస్తున్నాడు. ప్రస్తుతం అవి చిత్రీకరణ దశలో ఉన్నాయి.