కరోనా భయపెడుతున్నా ఆగిపోయిన సినిమాలన్నీ మళ్లీ పట్టాలెక్కాయి. జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణల్ని షురూ చేశాయి ఆయా చిత్రబృందాలు. నాని నటిస్తున్న 'టక్ జగదీష్' కూడా పది రోజులపాటు హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకొంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇంతలో మరోసారి ఆచిత్రానికి అడ్డంకి ఎదురైంది.
చిత్రబృందంలో ఒకరికి కరోనా.. షూటింగ్ నిలిపివేత - టక్ జగదీష్ షూటింగ్‌కు బ్రేక్
టాలీవుడ్ కథానాయకుడు నాని నటిస్తున్న కొత్త చిత్రం 'టక్ జగదీష్' షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఆ చిత్రబృందంలోని ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల చిత్రీకరణ నిలిచిందని సినీవర్గాలు ధ్రువీకరించాయి.
చిత్రబృందంలో ఒకరికి కరోనా.. షూటింగ్ నిలిపివేత
చిత్రబృందంలోని ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడమే అందుకు కారణం. సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా నిలిచిందని సినీవర్గాలు ధ్రువీకరించాయి. కరోనాతో బాధపడుతున్న సాంకేతిక నిపుణుడు కోలుకున్నాక మళ్లీ చిత్రం పట్టాలెక్కుతుంది.