తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాని 'టక్కు'లోనే ఉంది ఓ ఛమక్కు! - టక్​ జగదీష్​ అప్​డేట్స్

నాని ప్రస్తుతం నటిస్తోన్న 'టక్ జగదీష్' సినిమాలో హీరో వేసుకున్న టక్కులోనే ఓ ఛమక్కు ఉందని చెబుతోంది చిత్రబృందం. ఈ చిత్రం ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

tuck jagdeesh
నాని 'టక్కు'లోనే ఉంది ఓ ఛమక్కు!

By

Published : Apr 10, 2021, 6:00 AM IST

నాని వేసుకున్న టక్కులోనే ఓ ఛమక్కు ఉంది. అదేమిటన్నది తెరపైనే చూడాలని చెబుతోంది 'టక్‌ జగదీష్‌' చిత్రబృందం. సినిమా అన్నాక ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నెన్నో ఛమక్కులు. ఇలా హీరో హీరోయిన్లు ఒక చోటకి చేరినా అదో ఛమక్కు, అందులోనే ఓ మేజిక్‌ కనిపిస్తుంది. దాన్నే సినిమా భాషలో కెమిస్ట్రీ అంటుంటాం.

ఈ సినిమాలోనూ అలాంటి సన్నివేశం కోసమే కసరత్తులు చేస్తున్నట్టున్నారు దర్శకుడు శివ నిర్వాణ. ఆయన సన్నివేశం గురించి వివరిస్తుంటే అందులో లీనమైపోయారు కథానాయకుడు నాని, నాయిక రీతూ వర్మ. మరి ఆ సన్నివేశం కథా కమామిషూ ఏంటనేది తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చదవండి:'బాహుబలి', 'రాధేశ్యామ్' రికార్డు బ్రేక్ చేసిన 'పుష్ప'

ABOUT THE AUTHOR

...view details