తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ట్రైలర్​: గ్యాంగ్ పగ తీరేందుకు 'పెన్సిల్' సాయం - saranya

హాస్యభరితంగా ఉన్న 'గ్యాంగ్​లీడర్' ట్రైలర్​ ఆకట్టుకుంటోంది. నాని హీరోగా నటించిన ఈ సినిమా వచ్చే నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గ్యాంగ్​లీడర్​ సినిమా ట్రైలర్

By

Published : Aug 28, 2019, 12:47 PM IST

Updated : Sep 28, 2019, 2:20 PM IST

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గ్యాంగ్​లీడర్'. హాస్యభరితంగా ఉన్న ఈ ట్రైలర్​ను బుధవారం విడుదల చేసింది చిత్రబృందం. విలన్​పై పగ తీర్చుకునేందుకు వచ్చిన ఐదుగురు ఆడవాళ్లకు ఓ రచయిత సహాయపడితే ఎలా ఉంటుంది అనే వినూత్న కథాంశంతో ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. 'పెన్సిల్' అనే రైటర్​గా నాని కనిపించనున్నాడు. ఇతర పాత్రల్లో లక్ష్మి, శరణ్య, ప్రియాంక... ప్రతినాయకుడిగా కార్తికేయ నటించాడు.

"ఆకలేస్తే అక్షరాలు తింటాం. చలేస్తే పుస్తకాలు కప్పుకుంటాం","ప్రపంచంలో ఎంతటి మగాడినైనా మాయ చేయగలిగే ఒకే ఒక్క ఆయుధం అమ్మాయి","యుద్ధానికి సిద్ధం కండి.. సమర శంఖం నేను ఊదుతాను","నేను ఇంకా థ్రిల్లర్​ జానర్​లోనే ఉన్నాను. సైకో కిల్లర్​ జానర్​లోకి వెళ్లే లోగా మొదలుపెట్టేద్దాం" అంటూ సాగే సంభాషణలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతమందించాడు. విక్రమ్​.కె. కుమార్ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్​ నిర్మించింది. వచ్చే నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.​

ఇది చదవండి: బల్గేరియాలో 'ఆర్​ఆర్​ఆర్'​.. రాజమౌళి ఫొటో వైరల్​

Last Updated : Sep 28, 2019, 2:20 PM IST

ABOUT THE AUTHOR

...view details