నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'గ్యాంగ్‌లీడర్'. విభిన్న చిత్రాల్ని తీసే విక్రమ్.కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీస్ మేకర్స్ నిర్మిస్తోంది. ఆగస్టు 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలే 'జెర్సీ'తో ఆకట్టుకున్న అనిరుధ్ రవిచందర్ సంగీతమందిస్తున్నాడు.
'గ్యాంగ్‌లీడర్' నాని వచ్చేది ఎప్పుడంటే... - mythri movie makers
'జెర్సీ'తో హిట్ కొట్టిన నాని.. 'గ్యాంగ్‌లీడర్'తో ప్రేక్షకుల్ని మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఆగస్టు 30న సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.
నాని 'గ్యాంగ్‌లీడర్'కు డేట్ ఫిక్సయింది
ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నాడు హీరో నాని. ప్రియాంక అరుల్ రాజ్ హీరోయిన్గా, సీనియర్ నటి లక్ష్మి కీలక పాత్రలో, 'ఆర్.ఎక్స్.100' ఫేమ్ కార్తికేయ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు.
ఇది చదవండి: 92 ఏళ్ల క్రితం సినిమాలో 191 ముద్దులు