హీరో నాని విలన్‌గా నటిస్తున్న సినిమా 'వి'. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. నేచురల్ స్టార్ తొలిసారి ప్రతినాయకుడిగా కనిపిస్తుండటం వల్ల చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. త్వరలో వీరిద్దరి పాత్రలకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌లు రానున్నాయి.
"కృష్ణుడు గీతలో ఎప్పుడో చెప్పారు.. "రాక్షసుడు" ఎదిగిన నాడు ఒకడొస్తాడని.. వాడే ఇప్పుడొస్తున్నాడు.. "రక్షకుడు" వస్తున్నాడు.. జనవరి 27న నా ఫస్ట్‌లుక్ రానుంది".. అని నానిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు హీరో సుధీర్‌బాబు. "ఓహో.. అలాగా.. సరే! రాక్షసుడు ఫస్ట్‌లుక్‌లో జనవరి 28న మీ ముందుకు వస్తున్నాను" అని నాని రీట్వీట్ చేశాడు.
విభిన్న కథల ఎంపికలో నాని
తన కెరీర్ ప్రారంభం నుంచి విభిన్న కథలు ఎంచుకుంటూ సాగుతున్న నాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అయితే, ఈసారి ఏకంగా విలన్‌గా కనిపిస్తుండటం వల్ల సినీ అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. నానిని హీరోగా పరిచయం చేసిన దర్శకుడే ఈసారి విలన్‌గా చూపించబోతున్నాడు. ఇందులో సుధీర్ సరసన అదితిరావు హైదరీ, నానికి జోడీగా నివేదా థామస్ కనిపించనున్నారు. జగపతిబాబు, శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు నిర్మాత. ఉగాది కానుకగా మార్చి 25న విడుదల ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: కథ నచ్చితే ఎలాంటి పాత్రైన చేస్తా: బాబీసింహా