తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పుట్టినరోజున నాని కొత్త సినిమా కాన్సెప్ట్​ వీడియో - నేచురల్​ స్టార్​ నాని

నాని పుట్టినరోజు (ఫిబ్రవరి 24న) సందర్భంగా అతడి కొత్త సినిమా కాన్సెప్ట్​ వీడియోను విడుదల చేయనున్నారు. సితార ఎంటర్​టైన్​మెంట్స్​ నిర్మిస్తోంది.

#Nani27  movie concept video will be released tomorrow
నాని పుట్టినరోజున కొత్త సినిమా కాన్సెప్ట్​ వీడియో

By

Published : Feb 23, 2020, 9:21 PM IST

Updated : Mar 2, 2020, 8:16 AM IST

నేచురల్​ స్టార్​ నాని.. 'జెర్సీ', 'గ్యాంగ్​లీడర్​' సినిమాలతో ప్రేక్షకులను గతేడాది ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం 'వి', 'టక్ జగదీష్' చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇప్పుడు కొత్త ప్రాజెక్టును ప్రకటించాడు. సితార ఎంటర్​టైన్​మెంట్స్ దీనిని నిర్మిస్తోంది. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్​ వీడియోను రేపు విడుదల చేయనుంది.

'టక్‌ జగదీష్‌' ఫస్ట్‌లుక్​ను అప్పుడే విడుదల చేయనున్నారని సమాచారం. శివ నిర్వాణ.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే వచ్చిన టైటిల్‌ పోస్టర్‌ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచింది. ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ ఇందులో హీరోయిన్లు. జగపతి బాబు కీలక పాత్రధారి. తమన్‌ సంగీత దర్శకుడు. శివ-నాని కాంబినేషన్​లో వస్తున్న రెండో చిత్రమిది కావడం వల్ల అందరిలో అంచనాలు నెలకొన్నాయి.

ఇదీ చూడండి.. నాని పుట్టినరోజు సర్​ఫ్రైజ్ అదేనా..!

Last Updated : Mar 2, 2020, 8:16 AM IST

ABOUT THE AUTHOR

...view details