తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నేచురల్ స్టార్ మరో కొత్త ప్రయత్నం..! - నానీ డైరెక్టర్​ శ్రీకాంత్​

నేచురల్​ స్టార్​ నాని.. 'జెర్సీ', 'గ్యాంగ్​లీడర్​' చిత్రాలతో ఈ ఏడాది సినీప్రియులకు డబుల్​ ట్రీట్​ ఇచ్చాడు. అయితే ఇప్పటివరకు ప్రేక్షకులను తన భావోద్వేగాలతో కంటతడి పెట్టించి, కడుపుబ్బా నవ్వించిన ఈ హీరో ఇప్పుడు ప్రతినాయక ఛాయలున్న పాత్రలో దర్శనమివ్వనున్నాడట

Nani who will be busy with more films in 2020
ప్రతినాయకుడి పాత్రలో నేచురల్​ స్టార్​ నాని

By

Published : Dec 31, 2019, 11:05 AM IST

నేచురల్ స్టార్ మరో కొత్త ప్రయత్నం..!

ఈ ఏడాది జోరునే 2020లోనూ కొనసాగించనున్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రస్తుతం ఈ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'వి' చిత్రం వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న మరో సినిమాలో నాని ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించనున్నాడు. దీని తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో తీస్తున్న 'టక్​ జగదీష్​' చిత్రంతో బిజీ అవుతాడీ హీరో. ఈ సినిమా కూడా వచ్చే ఏడాదిలోనే సందడి చేయనుంది.

కొత్త దర్శకుడికి ఓకే...
అయితే తాజాగా నాని మరో కొత్త దర్శకుడు చెప్పిన కథకు ఫిదా అయినట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు క్రిష్​ దగ్గర పనిచేసిన శ్రీకాంత్​ అనే యువ దర్శకుడు ఇటీవలే నేచురల్​ స్టార్​కు ఓ కథ వినిపించాడట. అది నానికి బాగా నచ్చినందున ఈ స్ర్కిప్ట్​కు సై అన్నాడని సినీ పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇదీ చదవండి: 'ఆర్​ఆర్​ఆర్​' తర్వాత ఎన్టీఆర్​​తో ఏ దర్శకుడికి ఛాన్స్..!​

ABOUT THE AUTHOR

...view details