తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నాని 'వి' ఇంటికి వచ్చేది ఆరోజే! - అమెజాన్ ప్రైమ్​లో వి

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'వి' చిత్రం విడుదల ఖరారైంది. ఎట్టకేలకు ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు నాని. అందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశాడు.

నాని 'వి' ఇంటికి వచ్చేది ఆరోజే!
నాని 'వి' ఇంటికి వచ్చేది ఆరోజే!

By

Published : Aug 20, 2020, 1:41 PM IST

కరోనా కారణంగా చిత్రీకరణలు, సినిమా విడుదలలు వాయిదా పడ్డాయి. దీంతో నిర్మాతలు నష్టాల బారిన పడుతున్నారు. కొంత మంది ఓటీటీల వైపు మొగ్గు చూపుతుండగా.. మరికొందరు మాత్రం థియేటర్లలోనే విడుదల చేస్తామని అంటున్నారు. నాని కెరీర్​లో 25వ చిత్రంగా ప్రత్యేకంగా నిలిచిపోయే 'వి' సినిమాను కూడా థియేటర్లలోనే విడుదల చేస్తామని చాలాసార్లు స్పష్టం చేసింది చిత్రబృందం. అయితే వారి ప్రణాళికలు అన్నీ తారుమారయ్యాయి. దీంతో ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఓటీటీ వేదికగా విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేశాడు నాని. సెప్టెంబర్ 5న అమెజాన్​ ప్రైమ్​లో విడుదల చేయనున్నట్లు వెల్లడించాడు.

ఉగాది కానుకగా మార్చి 25న విడుదల కావాల్సిన 'వి'.. లాక్​డౌన్​ కారణంగా వాయిదా పడింది. వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్న కారణంగా థియేటర్లను ఇప్పట్లో తెరిచేలా కనిపించడం లేదు. అందుకే చిత్రబృందం ఓటీటీ మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో నాని ప్రతినాయకుడిగా కనిపించనుండగా, సుధీర్​బాబు పోలీస్​గా అలరించనున్నాడు. నివేదా థామస్, అదితీ రావ్ హైదరీ హీరోయిన్లు. మోహన్​కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. దిల్​రాజు నిర్మాత.

ABOUT THE AUTHOR

...view details