హీరో నాని.. అప్పుడప్పడూ ఆసక్తికర ట్వీట్స్ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంటాడు. గురువారం బాలల దినోత్సవం సందర్భంగా తన కొడుకు అర్జున్‌తో ఉన్న ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. అదిరిపోయే వ్యాఖ్య జోడించాడు.
"మీకు పిల్లులన్నారా, అయితే నోరు మూసుకొని ఉండండి. లేదంటే వారు ఆ పని చేస్తారు" -ట్విట్టర్లో నాని
ఇటీవలే 'గ్యాంగ్‌లీడర్'తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు నాని. ప్రస్తుతం 'వి' అనే సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. సుధీర్‌బాబు, నివేదా థామస్, అతిదీ రావ్ హైదరీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోందీ చిత్రం. వచ్చే ఏడాది ఉగాది కానుకగా మార్చి 25న థియేటర్లలోకి రానుంది.
ఇది చదవండి: నాని మాటలు వింటే భయమేసిందన్న టాలీవుడ్ దర్శకుడు