తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షూటింగ్ షురూ: నాని టక్.. టాక్ - nani shiva nirvana

నాని 'టక్ జగదీష్' షూటింగ్ తిరిగి మొదలైంది. ప్రస్తుతం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

nani tuck jagadish cinema shooting restart
హీరో నాని

By

Published : Oct 9, 2020, 6:20 AM IST

కరోనా ప్రభావంతో ఆగిన 'టక్‌ జగదీష్‌' మళ్లీ మొదలైంది. నాని హీరోగా, శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లు. ఈ సినిమా చిత్రీకరణ గురువారం పునఃప్రారంభమైనట్లు నాని ట్వీట్ చేశారు.

వరి పొలాల మధ్య నుంచోని ఉన్న ఓ చిత్రాన్ని అభిమానులతో పంచుకుంటూ.. "జగదీష్‌ వచ్చాడు.. టక్‌ మొదలైంది" అని ట్విట్టర్​లో ఫొటో పోస్ట్ చేశారు. ప్రస్తుతం రాత్రిపూట వరి పొలాల్లో, నానితో పాటు మరికొంత మంది నటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే 40శాతం చిత్రీకరణ పూర్తయింది. డిసెంబరు నాటికి మొత్తం సినిమా పూర్తి కానున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details