తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మన్మథుడు-2' దర్శకుడితో నేచురల్​ స్టార్​! - rahul ravindran

ప్రస్తుతం 'వి' షూటింగ్​లో బిజీగా ఉన్న నేచురల్​ స్టార్​ నాని మరో సినిమాకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చాడని తెలుస్తోంది. 'మన్మథుడు 2' దర్శకుడు రాహుల్​ రవీంద్రన్​ కథకు ఓకే చెప్పాడని సమాచారం.

నాని

By

Published : Aug 25, 2019, 2:37 PM IST

Updated : Sep 28, 2019, 5:22 AM IST

నాని 'గ్యాంగ్‌లీడర్‌' షూటింగ్​ పూర్తయింది. ప్రస్తుతం మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో 'వి' షూటింగ్​లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత నాని, రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్​లో ఓ మూవీ రాబోతుందని సమాచారం.

హీరో నుంచి దర్శకుడిగా మారిన రాహుల్‌ రవీంద్రన్‌ తొలి సినిమా 'చి.ల.సౌ'కు స్క్రీన్‌ప్లే విభాగంలో జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇటీవలే నాగార్జునతో 'మన్మథుడు 2' తెరకెక్కించాడు. ప్రస్తుతం రాహుల్‌-నాని కాంబినేషన్‌లో ఓ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఈ చిత్రం సితార ఎంటర్​టైన్​మెంట్ పతాకంపై తెరకెక్కనుందట. నాని నటించిన 'జెర్సీ' సినిమా ఈ నిర్మాణ సంస్థ నుంచే వచ్చింది.

ఇవీ చూడండి.. 'గీత గోవిందం' దర్శకుడితో అఖిల్​..!

Last Updated : Sep 28, 2019, 5:22 AM IST

ABOUT THE AUTHOR

...view details